19 కొత్త విమానాశ్రయాల నిర్మాణం: అశోక్‌ గజపతి రాజు

SMTV Desk 2017-12-22 12:06:54  p ashok gajapathiraju, Construction of airports, loksaba

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించిందని పౌర విమానయాన మంత్రి పి.అశోక్‌ గజపతి రాజు లోక్‌సభకు తెలిపారు. మొత్తం 19 కొత్త విమానాశ్రయాలను నిర్మించగా ఇందులో కొన్ని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, దగదర్తి, గోవాలోని మోపా, మహారాష్ట్రలో నవీ ముంబయి, సింధుదుర్గ్‌, కర్ణాటకలో హసన్‌, కేరళలో కన్నూర్‌, గుజరాత్‌లో ధోలెరాలో నిర్మించే విమానాశ్రయాలు పీపీపీ పద్ధతిలో వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వాలూ భాగం పంచుకుంటాయని వెల్లడించారు. వీటి నిర్మాణానికి మొత్తం రూ.27,000 కోట్ల పెట్టుబడి అవసరమని పేర్కొన్నారు.