‘బాహుబలి’ రీమేక్‌ లో భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్‌

SMTV Desk 2017-12-21 16:34:38  bahubali, Remake, mahabali, Bhojpuri actor Dineshlal yadav

హైదరాబాద్‌, డిసెంబర్ 21 : ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి. ఈ సినిమాను రీమేక్‌ చేయడానికి భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్‌ యాదవ్‌ హక్కులు దక్కించుకున్నారు. ఈ రీమేక్ కు ‘వీర్‌ యోధ మహాబలి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రోమోలకు సంబంధించిన చిత్రీకరణ మహారాష్ట్రలోని ఓ గ్రామంలో జరుగుతోంది. దీనికి సంబంధించిన విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ సెట్స్‌లోని ఫొటోను పోస్ట్ చేశారు. కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇక్బాల్‌ భక్ష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దినేశ్‌లాల్‌కి జోడీగా ఆమ్రపాలి దుబే నటిస్తున్నారు.