తీర్పు చరిత్రాత్మకం : స్టాలిన్

SMTV Desk 2017-12-21 14:58:45  dmk stalin, 2g spectrum, kanimouli, raja, former minister

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కాంగ్రెస్ హయంలో భారీ కుంభకోణంగా పేరొందిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిని నిర్దోషులుగా పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో వారి కుటుంబ సభ్యులతో పాటు డీఎంకే పార్టీ కార్యకర్తలలో ఆనందాలు వెల్లివిరిశాయి. తీర్పు వెలువడగానే కనిమొళి ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈ విషయంపై డీఎంకే నేత ఎం.కె.స్టాలిన్‌ స్పందిస్తూ.."తీర్పు చరిత్రాత్మకం. డీఎంకేను నాశనం చేసేందుకు కేసు పెట్టారు. పార్టీ ఎలాంటి తప్పూ చేయలేదని కోర్టు తీర్పుతో వెల్లడైంది" అని వ్యాఖ్యానించారు. కనిమొళి తల్లి రాజతైఅమ్మాళ్ కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. "న్యాయమే గెలిచింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తీర్పుతో నా కూతురు, మిగతా వారి నిజాయతీ రుజువైంది" అని ఉద్వేగభరితంగా తెలిపారు.