దేవుడికి చలేస్తోందని..!

SMTV Desk 2017-12-21 14:44:26  ayodhya, winter season, janaki ghat temple. ayodhya.

అయోధ్య, డిసెంబర్ 21 : అక్కడ దేవుడికి చలేస్తోందని హీటర్లను పెట్టించారు. అదేంటి.. దేవుడేంటి.? చలేంటి అనుకు౦టున్నారా.? అవును అయోధ్యలోని జానకి ఘాట్‌ బడాస్థాన్‌ ఆలయ పండితులు దేవుళ్లకి కూడా చలేస్తుందని అంటున్నారు. అందుకోసం ఏకంగా గర్భగుడిలోనే హీటర్లను పెట్టించినట్లు పేర్కొన్నారు. స్వయంగా ఈ విషయాలను ఆలయ వేద పండితుడు జన్మయ్‌ షరన్‌ వెల్లడించారు. అంతేకాదు అభిషేకం కోసం వేడి నీళ్ళను వాడుతున్నట్లు, అయోధ్యలోని రాముడిలా విగ్రహానికి నూలు దుస్తులు వేయాలని, ఆలయంలో హీటర్లు పెట్టించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్‌ చేసిందని వీహెచ్‌పీ ప్రతినిధి శరద్‌శర్మ తెలిపారు.