చైతు ను నాగ్ ప్రశంసించడంతో సమంత ఏడ్చింది..?

SMTV Desk 2017-12-21 14:38:53  Hello is the films pre-release ceremony, nagarjuna, nagachaitanya, samanta

హైదరాబాద్, డిసెంబర్ 21 : అఖినేని అఖిల్ నటిస్తున్న ‘హలో’ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక బుధవారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబంతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే, వేడుకలో నాగార్జున మాట్లాడుతూ...పెద్ద కుమారుడు నాగచైతన్యకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదంటూ కొడుకును ప్రశంసించారు. అది విని అభిమానులు కేకలు వేశారు. ఆ సమయంలో సమంత కళ్లు చెమర్చటం చూసి, ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని ఓ అభిమాని వెల్లడిస్తూ నిజమైన ప్రేమంటే ఇదేనని నాగ్‌ మాట్లాడుతున్న వీడియో పోస్ట్‌ చేశాడు. ట్వీట్‌ చూసిన సమంత వెంటనే స్పందిస్తూ,‘అయ్యో.. ఆ సమయంలో నేను ఏడవలేదు. కళ్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని చెప్తూ దండం పెడుతున్న ఇమోజీలు పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌కి జోడీగా ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్న సమంత మరో పక్క ‘అభిమన్యుడు’, ‘మహానటి’ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. కళ్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఆమె కొద్దిరోజులు విరామం తీసుకున్నట్లు సమాచారం.