మోత్కుపల్లి మౌనదీక్ష భగ్నం

SMTV Desk 2017-12-21 13:57:50  Motkupalli Narasimhulu, ttdp leader, protest, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 21 : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందని, మాజీమంత్రి, తెలంగాణ తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ మోత్కుపల్లి ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం మౌనదీక్ష దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." వర్గీకరణ విషయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలి" అని వ్యాఖ్యానించారు. కాగా ఈ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్నుఅదుపులోకి తీసుకున్నారు.