మాకు కొంత బ్రేక్ కావాలి :ఎస్‌.ఎస్‌ రాజమౌళి

SMTV Desk 2017-12-21 13:23:42  S.S Rajamouli, hero prabhas, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 21 : ఎస్‌.ఎస్‌ రాజమౌళి, ప్రభాస్‌ దాదాపు ఐదేళ్లపాటు కలిసి పని చేసి ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించారు. అయితే, ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం మున్ముందు రాబోతుందా? అన్న ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ... ఐదేళ్లు ప్రభాస్ తో కలిసి పని చేశాను కాబట్టి, కొంత బ్రేక్‌ కావాలి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంతో బిజీగా ఉన్నందున, భవిష్యత్తులో చేసే అవకాశం ఉన్నట్లు తెలిపిన రాజమౌళి. ప్రస్తుతానికి రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరికీ జోడీగా బాలీవుడ్‌ నటీమణులను ఎంపిక చేసుకోనున్నట్లు సమాచారం. నూతన ఏడాదిలో ఈ చిత్రీకరణ ప్రారంభించనున్నారు.