పడిపోతున్న ఉష్ణోగ్రతలు…

SMTV Desk 2017-12-21 12:17:30  weather report, telangana, temparatures.

హైదరాబాద్, డిసెంబర్ 21 : ఉత్తర భారత్ నుండి నగరానికి అతి శీతల గాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రత 4 డిగ్రీలు తగ్గి చలి తీవ్రత పెరిగింది. దీంతో రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్మేస్తోంది. నిన్న రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత 10.8 డిగ్రీలుగా నమోదు కాగా, సాధారణ సమయంలో 14.8 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ చలి తీవ్రత రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గి.. రెండు రోజుల నాటికి 11 నుంచి 12 డిగ్రీల స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.