ఆర్‌జేసీ చంద్రశేఖర్‌ ఆజాద్‌పై సస్పెన్షన్‌ వేటు..

SMTV Desk 2017-12-21 11:30:41  chandrashekar azad, Divisional Department Regional Joint Commissioner, manmohan singh,

అమరావతి, డిసెంబర్ 21: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడ్డ దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనను సస్పెండ్‌ చేస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఆదేశాలు జారీచేశారు. రాజమండ్రి ఆర్‌జేసీగా ఆజాద్‌ స్థానంలో ద్వారకా తిరుమల ఈవో త్రినాథరావును నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 13 న ఏసీబీకి చిక్కిన ఆయన కు న్యాయస్థానం రిమాండ్‌ విదించింది.