అమరావతికి 27న రాష్ట్రపతి రాక.. భారీ ఏర్పాట్లు..

SMTV Desk 2017-12-21 11:16:29  ramnath kovind, dinesh kumar, amaravathi, ap

అమరావతి, డిసెంబర్ 21: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సమీక్షించారు. శాఖల వారిగా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 27 వ తేదిన గన్నవరం విమానశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయ౦లో ఇండియన్‌ ఎకనామిక్స్‌ అసోసియేషన్‌ సదస్సుల్లో పాల్గొంటారు. ఆ తరువాత హెలికాఫ్టర్ లో సచివాలయానికి విచ్చేసి, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏపీ ఫైబర్ గ్రిడ్ ను ప్రారంభిస్తారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్ లో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ పనితీరును పరిశీలిస్తారు. రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాలలో ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా చూసుకోవాలని దినేష్‌కుమార్‌ అధికారులకు ఆదేశించారు.