కుక్కలకు ఆహారంగా మారిన శిశువు

SMTV Desk 2017-06-17 17:15:44  dogs, eating, new baby

కురవి, జూన్ 17 : పిల్లలను కనడం పెంచలేని పరిస్థితుల్లో వాళ్ళను రోడ్డు పక్కన లేదా చెత్త కుప్పలో పడేయడం వంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటిదే మహబూబాబాద్ జిల్లా కురవిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... అప్పుడే పుట్టిన మగ బిడ్డను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపక్కన పడేసి వెళ్లారు. ఆ సమయంలో మనుషులు ఎవరు లేక పోయే సరికి అక్కడే ఉన్న కుక్కలు ఆ శిశువును పీక్కొని తిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేసారు. కొద్ది సేపటికి అటు నుంచి వెళ్తున్న స్థానికులు ఆ కుక్కులను తరిమేలోపే ఆ పసికందు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఆ శిశువుని పారేసింది ఎవరో కనిపెట్టె ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.