"వారు లేనిదే.. నేను లేను" అంటున్న శ్రద్ధా..!

SMTV Desk 2017-12-20 13:04:58  Bollywood star Shraddha Kapoor, Soho movie, twitter

హైదరాబాద్, డిసెంబర్ 20 : తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్.. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సాహో’ చిత్రం గురించి, అలాగే ప్రభాస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. "ప్రభాస్ నిజంగా ‘డార్లింగ్‌’. నేను కలిసిన అద్భుతమైన వ్యక్తుల్లో ప్రభాస్‌ ఒకరు. ఇక నా అభిమానుల విషయానికి వస్తే వారు లేనిదే, నేను లేను. నా అభిమానులు ది బెస్ట్‌" అని ట్వీట్ చేశారు. మరి కొద్ది రోజుల్లో ‘సాహో’ తో అందరి ముందుకు రానున్నట్లు వెల్లడించారు.