తెలుగు మహాసభల్లో టాలీవుడ్‌ ‘జయహో’ పాట

SMTV Desk 2017-12-20 12:38:38  telugu mahasabhalu, jayaho song, golkonda, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేసిన కవులు, రచయితలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ పాటను రూపొందించింది. ‘జయహో.. జయహో..’ అంటూ సాగే ఈ పాటను సినీ గేయ రచయిత చంద్రబోస్‌ రాశారు. గోల్కొండ కోటలో దీన్ని చిత్రీకరించారు. టాలీవుడ్‌కి చెందిన యువ నటీనటులు సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్, వరుణ్ తేజ్, నవీన్ చంద్ర, లావణ్య త్రిపాటి, సునీల్, చంద్రబోస్, సునీత, రేవంత్, షాలిని పాండే, తదితరులు ఈ పాటలో ఆడి, పాడి సందడి చేశారు. కాగా తెలుగు మహాసభల గుర్తుగా ప్రేక్షకులకు ఈ పాటను అంకితం చేశారు.