మహాసభల్లో పాల్గొన్న రాష్ట్రపతి...

SMTV Desk 2017-12-19 18:35:55  Telugu mahasabhalu, president ramnath kovindh, cm kcr, pragathi bhavan meeting.

హైదరాబాద్, డిసెంబర్ 19 : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాసేపటి క్రితమే ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వెంట ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. కాగా గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ తెలుగు మహా సభలలో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకలకు దేశ విదేశాల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.