పెరిగిన బంగారు, వెండి ధరలు

SMTV Desk 2017-12-19 17:11:21  gold, silver rates increase, stock markets, trading.

ముంబై, డిసెంబర్ 19 : బంగారం ధర మరోసారి పెరిగింది. దీనికి అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా ఉండటం, కొనుగోళ్లపై ఆభరణాల తయారీ దారులు ఎక్కువగా ఆసక్తి చూపడమే కారణమని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. నాటి ట్రేడింగ్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ.175 పెరిగి రూ.29,700కి చేరింది. ఇదే బాటలో వెండి కూడా చేరింది. రూ.150 పెరిగి.. కిలో వెండి రూ.38,250కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాల నుంచి అధికంగా డిమాండ్‌ ఉండడంతో ఈ వెండి ధర పెరిగినట్లు మార్కెట్‌ ట్రేడ్స్ చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం పసిడి ధర 0.18శాతం పెరిగి ఔన్సు 1,264.20 డాలర్లు పలికింది. వెండి 0.15శాతం పెరిగి ఔన్సు 16.16 డాలర్లు చేరుకుంది.