తుక్కు గోదాములో అగ్ని ప్రమాదం...

SMTV Desk 2017-12-19 13:05:36  fire accident, l b nagar, hyderabad

కర్మన్‌ఘాట్‌, డిసెంబర్ 19: ఎల్బీనగర్‌ లింగోజీగూడ డివిజన్‌ పరిధిలోని బైరామల్ గూడలో సోమవారం అర్ధరాత్రి తుక్కు గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుద్గాతం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని, దాదాపు రూ.10లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు.