ఆర్ధిక మంత్రికి కాలనీ శిక్ష...

SMTV Desk 2017-12-18 18:53:08  Alex Yuvikov, russia, masko,

రష్యా, డిసెంబర్ 18: దేశ ఆర్ధిక మంత్రిగా పనిచేసిన అలెగ్జ్ యువికేవ్ కు మాస్కోలోని ఓ కోర్టు కాలనీ శిక్ష విధించింది. కాలనీ శిక్ష అంటే బంధువులు ఎవరితో సంబందాలు ఉండవు. దాదాపు మరణశిక్షతో ఇది సమానమని అంటుంటారు. అంతేకాదు 130 మిలియన్ ల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. ఆయనపై కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన స్టింగ్ ఆపరేషన్ లో ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీ అదినేత నుంచి రెండు మిలియన్ డాలర్ల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం విచారించి తీర్పును వెల్లడించింది.