బెయిల్ పై విడుదలైన దీపక్ రెడ్డి

SMTV Desk 2017-06-17 14:54:14  Chanchalguda prison, AP MP JC Diwakarreddy,TDP MLM Deepak Reddy,

హైదరాబాద్, జూన్ 17 : తెలంగాణ రాష్ట్రంలోని మియాపూర్ అక్రమ భూకుంభకోణం కేసులో ఫోర్జరీ పత్రాలతో రూ.కోట్లు విలువచేసే భూములను కబ్జా చేసి చంచల్‌గూడ జైలులో ఉన్న ఏపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మేనల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి శుక్రవారం రాత్రి బెయిల్‌పై విడుదలయ్యారు. భూకుంభకోణం కేసులో దీపక్‌రెడ్డితో పాటు ఇదే కేసులో అరెస్టయిన న్యాయవాది శైలేష్‌ సక్సేనాలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు దీపక్‌రెడ్డిని ప్రతి బుధ, శని వారాలలో సీసీఎస్‌ పోలీసుల ముందు హాజరుకావాలని తదితర షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.న్యాయవాది సక్సేనాకు బెయిల్ మంజూరైనా ఇతర కేసులు పెండింగ్‌లో ఉండడంతో జైలు నుంచి విడుదల కాలేకపోయారు.