కేటిఅర్ కు శుభాకాంక్షల వెల్లువ...

SMTV Desk 2017-12-18 12:57:52  ktr, manchu vishnu, vijya devarakonda, leader of the year 2017

హైదరాబాద్, డిసెంబర్ 18 : ఎప్పటికప్పుడు తన దైన శైలిలో స్పందిస్తూ, రాష్ట్ర అభివృద్దికి, ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న కల్వకుంట్ల తారక రామారావు కు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు తన వశమైంది. ఇప్పటికే పలు జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు ట్విట్టర్ వేదికగా.. > హీరో విజయ్ దేవరకొండ : రామన్నా... లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనందుకు కంగ్రాట్స్. మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నా... ఎందుకంటే సుదీర్ఘ కాలం మీరు మాకు అవసరం > కేటిఆర్ : థ్యాంక్స్ అర్జున్ రెడ్డి... ఇప్పుడు మిమ్మల్ని గారు అంటే బాగుండదేమో > మంచు విష్ణు : నా సోదరుడు కేటిఆర్ కు శుభాకాంక్షలు. మరిన్ని అవార్డులు అందుకోవాలి. ఇది తెలుగువారికి గర్వ కారణం. > కేటిఅర్ : ధన్యవాదాలు సోదర. నీ ఆరోగ్యం బాగుందిగా. > వెన్నెల కిషోర్ : శుభాకాంక్షలు కేటిఅర్ సార్. ఈ అవార్డుకు మీరు అర్హులు. ఇలాగే ముందుకు కొనసాగండి. > కేటిఅర్ : కృతజ్ఞతలు కిషోర్ గారు. అంటూ ట్విట్ చేశారు.