ముంబాయిలో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి..

SMTV Desk 2017-12-18 11:39:44  fire accident, mumbai, maharastra,

ముంబాయి, డిసెంబర్ 18: ముంబాయిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఖైరానీ రోడ్డులోని ఓ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు, పోలీసులు తెలిపారు.