శీతాకాలం ఇవి తింటే చాలా మంచిది...

SMTV Desk 2017-12-17 17:35:56  winter, seasonal food, health problems

హైదరాబాద్, డిసెంబర్ 17: శీతాకాలంలోని చలి అందరినీ వణికిస్తుంది. ఇక ఈ పొగ మంచు కారణంగా రకరకాల వ్యాధుల భారిన పడుతుంటాం. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ సిజన్ లో ఏ ఆహార పదార్ధాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అనే అంశంపై అందరూ దృష్టి పెట్టాలి. అందుకే మీ ఆరోగ్యం కోసం. * చలికాలంలో సూర్యరశ్మి కొరత ఉంటుంది కనుక విటమిన్‌-డి, సిలు ఉండే పదార్ధాలను మనం తీసుకోవాలి. ఈ విటమిన్స్ క్రాన్‌బెర్రీస్‌ పళ్లల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండ్లు చర్మ సమస్యల నుంచి కూడా రక్షణనిస్తాయి. క్రాన్‌బెర్రీస్‌లోని యాంటాక్సిడెంట్లు, ప్రొటీన్ల వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను కూడా ఇవి నియంత్రిస్తాయి. * నిమ్మ రసం రోజుకి మధ్యమధ్యలో కొద్దిగా తాగుతుంటే శరీరంలో నీటి శాతం సరిపడినంత మెరుగుపడి, గొంతు సమస్యలు తగ్గుతాయి. ప్రధానంగా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. * పొగమంచు వల్ల తలెత్తే ప్రతీ సమస్యకు వాల్‌నట్స్‌ పరిష్కారం. ఇవి తినడం వలన శ్వాసకోశ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అంతేకాదు ఈ వాల్ నట్స్ మూడ్‌-బూస్టర్‌గా కూడా పనిచేస్తూ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంచుతాయి. * ఇక రోజులో కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి. నీళ్లు బాగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విషపదార్థాలు బయటకుపోతాయి. సరిగా తాగకపోతే జీర్ణకోశ సమస్యలతో అనారోగ్యపాలవుతారు. * కాలుష్య ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే బెల్లం తినాలి. బెల్లంలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. అంతేకాదు రక్తంలో ఆక్సిజన్‌ సరఫరా కూడా బాగుంటుంది.