సూపర్ స్టార్ కోసం లావైన సడన్ స్టార్...!

SMTV Desk 2017-12-17 15:59:08  allari naresh, mahesh babu, vamshi paidipalli.

హైదరాబాద్, డిసెంబర్ 17: వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న వంశీపైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్నారు. అయితే ఇందులో సడన్ స్టార్ అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్య ఓ కార్యక్రమానికి హాజరైన నరేశ్ బొద్దుగా కనిపించారు. మహేశ్ సినిమా కోసమె నరేశ్ లావు అయ్యారట. ప్రస్తుతం మహేష్.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి గా మహేశ్ కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత వంశీ-మహేష్ ల మూవీ ప్రారంభమవుతుందో చూడాలి.