సోనియా శక్తిమంతమైన నాయకురాలు: మన్మోహన్‌

SMTV Desk 2017-12-17 15:52:19  manmohan singh, comments, sonia gandhi, powerful leader

న్యూ డిల్లీ, డిసెంబర్ 17‌: 10 సంవత్సరాలు యూపిఎ అధ్యక్షురాలిగా, 19 ఏళ్లు కాంగ్రెస్‌ నాయకురాలిగా విశేష సేవలందించిన సోనియా శక్తిమంతమైన నాయకురాలిగా నిలిచారని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కొనియాడారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉన్నా ఆ పదవిలో తనను కూర్చోబెట్టి త్యాగమూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్న మన్మోహన్‌ పదేళ్ల యూపీఏ పాలనలో దేశ వృద్ధిరేటు ఏడాదికి సగటున 7.8 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో మత, కుల రాజకీయాలు పెరిగి పోతున్నాయని ఇవి దేశ లౌకికతత్వానికి ప్రమాదం అని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని పునర్నిర్మించే భాద్యత తిరిగి కాంగ్రెస్ కు ఇవ్వాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో రాహుల్ అధ్యక్షతన కొత్త శకం ప్రారంభమై౦దని ఆయన తెలిపారు.