ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ కు సానియా దూరం

SMTV Desk 2017-12-17 15:25:57  tennis star Sania Mirza, Australian open series, knee pain, surgery.

ముంబై, డిసెంబర్ 17 : ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ కు దూరమైంది. ఇటీవల ఆమె మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు ఆమెను ఓ రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని స్వయంగా సానియా వెల్లడించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆటకు దూరం కావడం పెద్ద విషయమేమీ కాదు. ఆరు నెలలు విశ్రాంతి తీసుకున్న రోజర్ ఫెదరర్ ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. నేను కూడా అదే బాటను అనుసరిస్తా" అంటూ తెలిపారు.