పదవులనుండి తప్పుకున్న అరుణభ్

SMTV Desk 2017-06-17 12:27:53  arunabh kumar, ceo arunabh, mumbai, tvf ceo arunabh, tvf ceo arunab,

ముంబాయి, జూన్ 17: లైంగిక వేధింపుల కేసులో వెబ్ మీడియా సీఈఓ తన విధులనుండి తప్పుకున్నారు. తాను వెబ్ మీడియా కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఓ మాజీ ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ద వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) అనే వెబ్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న అరుణభ్ కుమార్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఓ మాజీ ఉద్యోగినిని లైంగికంగా వేధించినట్టు అరుణభ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీవీఎఫ్ వ్యవస్థాపకుడు కూడా ఇతడే ఐనప్పటికీ, తన కంటే సంస్థే ఉన్నతమైనదని భావించిన అరుణభ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసారు. ఈయన స్థానంలో నూతన సీఈవోగా ధావల్ గుసైన్ బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం. ఓ మాజీ ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అరుణభ్ పై మార్చి 29వ తేదీనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 2014-16 మధ్య కాలంలో టీవీఎఫ్ లో పనిచేసిన సమయంలో అరుణభ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు అన్నారు.