జనవరిలో నటి భావన వివాహమా?

SMTV Desk 2017-12-17 12:57:16  actor bhavana marriage, Kannada producer Naveen

హైదరాబాద్, డిసెంబర్ 17 : మలయాళ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన నటి భావన, ఈ ఏడాది మార్చి 9న కన్నడ నిర్మాత నవీన్‌ తో నిశ్చితార్థం జరిగింది. అయితే, వీరి వివాహ వేడుక జనవరి 22న జరుగనున్నట్లు సమాచారం. తెలుగు లో ‘ఒంటరి’, ‘హీరో’, ‘మహాత్మా’, ‘నిప్పు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన భావన, ప్రస్తుతం ఓ కన్నడ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. జనవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా, త్రిసూర్‌లో వీరి వివాహం జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మాత్రమే హాజరు కాబోతున్నారట. అనంతరం ఏర్పాటు చేసే విందుకు సినీ ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు సమాచారం. మొత్తానికి నటి భావన నూతన ఏడాదిలో కొత్త బంధాన్ని అల్లుకుంటుంది.