చెన్నంపల్లి కోటలో అసలు ఏముంది...!

SMTV Desk 2017-12-17 10:56:28  karnool, chennampalli kota, andhrapradesh,

కర్నూలు, డిసెంబర్ 17: అనగనగా ఓ కోట, ఆ కోటలో బంగారు నిక్షేపాల కొరకై వేట. కోటలో నిధులు ఏంటి? అని ఆలోచిస్తున్నారా... అవునండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో భారీ ఎత్తున నిధి నిక్షేపాలు దాచిన ప్రాంతం ఆచూకీ లభించిందని పురావస్తు, మైనింగ్ అధికారులు తెలిపారు. కోట లోని ఓ గది కిందకు దాదాపు 20 అడుగుల లోతున ఉన్న ఓ రహస్య సొరంగాన్ని కనిపెట్టారు. దీంతో అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసి, పలువురు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కానీ ఆ కోటలోనికి గుర్తింపు పొందిన అధికారులకు మాత్రమే ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు. ఇంతకీ ఆ సొరంగంలో ఏముందో తెలుసుకోవడానికి అధికారులు స్కానర్ల సాయంతో పరిశీలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడి ప్రాంతానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. మరికాసేపట్లో నిజం తేలనుంది.