తెలుగు మహాసభలకు ఏపీ సిఎంను ఆహ్వానించనందుకే...

SMTV Desk 2017-12-16 17:28:27  telugu mahasabhalu, Avadhani giripati Narasimha Rao, ap cm chandrababunaidu

హైదరాబాద్, డిసెంబర్ 16 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వానం పై అతిధులు పెద్ద ఎత్తులో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మహాసభలలో ప్రవచనాలు చెప్పమని ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ, గరికపాటి దీన్ని తిరస్కరించారు. తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదన్న ఆయన, ఆంధ్రాకు చెందిన వాడిగా తాను మహాసభలకు వెళ్లడం భావ్యం కాదని వెల్లడించారు.