మొదలైన ఎపి మంత్రివర్గ సమావేశం...

SMTV Desk 2017-12-16 17:26:10  ap, cabinet meeting, start, amaravati, polavaram, chandrababu

అమరావతి, డిసెంబర్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమై౦ది. ఎజెండాలో లేనప్పటికీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 23న పోలవరానికి వస్తున్న నేపధ్యంలో పోలవరం అంశాన్ని టేబుల్ ఐటమ్ గా చేర్చి చర్చిస్తున్నారు. అలాగే ఎపి అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రభుత్వ భవనాల నమూనాలను క్యాబినెట్ ముందు సీఎం ఉంచారు. ఆంధ్రప్రదేశ్ పోలిస్ ఆక్ట్- 2014ను ఉపసంహరించుకొని, కర్ణాటక తరహాలో డీజీపీని రాష్ట్రమే నియమించుకునేలా ఆర్డినెన్సుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.