తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోతాయి : ఈటల

SMTV Desk 2017-12-16 17:22:34  Finance Minister Rajender, telugu maha sabhalu, lb nagar.

హైదరాబాద్, డిసెంబర్ 16 : తెలంగాణ గొప్ప సంస్కృతి కలిగిన రాష్ట్రమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎల్బీ నగర్ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సభకు మంత్రి ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పాటలు, ఆటలు ప్రజల గుండెల్ని కదిలిస్తాయన్నారు. కవికి సామాజిక దృక్పథం ఉండాలని.. ఒక్క సిరా చుక్క లక్ష మెదడులను కదిలిస్తుందన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.