నిర్లక్ష్య ధోరణి వీడాలి : కేటీఆర్‌

SMTV Desk 2017-12-16 14:46:32  mana nagaram, minister ktr, ghmc officers, kcr speech on mana nagaram meeting.

హైదరాబాద్, డిసెంబర్ 16 : బస్తీలలో సంక్షేమ సంఘాల ప్రతినిధుల సమస్యల పరిష్కార౦ కోసం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన "మన నగరం" తొలి సమావేశాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "మన నగరాన్ని మనమే పరిరక్షించుకోవాలి. ఎవరో వచ్చి చేస్తారనుకోవడం, జీహెచ్‌ఎంసీ అధికారులే వచ్చి చేస్తారు అన్న ధోరణి వీడాలి" అంటూ హితబోధ చేశారు. ఎదగాలంటే ముందుగా ఆలోచన విధానం మార్చుకొని అందుకనుగుణంగా భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకోవాలని, నిర్లక్ష్య ధోరణి వీడాలని కోరారు. ఈ సమావేశంలో బస్తీ వాసులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు.