నేడు జీఎస్‌టీ మండలి సమావేశం...

SMTV Desk 2017-12-16 14:17:40  GST council meeting, started today, e way bill.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16 : నేడు జీఎస్‌టీ మండలి సమావేశం జరగనుంది. జీఎస్‌టీ వ్యవస్థలోని సమస్యలు, పన్ను ఎగవేత నిరోధం, ఈ-వే బిల్లును అమల్లోకి తీసుకురావడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ఈ-వే బిల్లును దశలవారీగా జనవరి 1 నుండి... దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1 నుండి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. కాని అక్టోబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు తగ్గడంతో ఈ ముందస్తు సమీక్ష నిర్వహించనున్నారు. కాగా గత మండలి సమావేశంలో పన్ను రేట్లు 178 వస్తువులపై తగ్గించిన విషయం తెలిసిందే.