అమెరికా పర్యటనలో లోకేశ్

SMTV Desk 2017-12-16 10:52:50  america tour, IT Minister naralokesh

అమరావతి, డిసెంబర్ 16 : అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారాలోకేశ్ పెట్టుబడుల విషయంలో రెండో రోజు పర్యటనలో భాగంగా గూగుల్ కో ఫౌండర్ సెర్జే బ్రిన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి వివిధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని సెర్జే బ్రిన్ కు లోకేశ్ వివరించారు. వ్యవసాయం, నీటిపారుదలలో సస్సార్ల వాడకం, డ్రోన్ల వినియోగం ద్వారా రోడ్ల నాణ్యత తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న తీరును ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు సెర్జే కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత జోహో కంపెనీ చీఫ్ ఏవాన్జాలిస్ట్ రాజు వేగేసేనను లోకేశ్ కలిసి ఐటీ అభివృద్ధి పై తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు. ఈ మేరకు తిరుపతిలో సత్వరమే కార్యకలాపాలు ప్రారంభించటానికి సుముఖుత వ్యక్తం చేసిన జోహో కంపెనీ తాత్కాలిక కార్యాలయానికి జనవరిలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపింది.