అట్టహాసంగా ప్రారంభమైన తెలుగు మహాసభలు...

SMTV Desk 2017-12-15 19:20:16  telugu mahasabhalu, started, vice president, venkaiah naidu, cm kcr.

హైదరాబాద్, డిసెంబర్ 15 : ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా రాధారెడ్డి కూచిపూడి కళాకారుల "మన తెలంగాణ" నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సభలకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువుకు పాదాభివందనం చేశారు. ఈ వేడుకలకు దేశ విదేశాల నుండి భాషాభిమానులు హాజరయ్యారు. కాగా మహాసభలు ఎల్బీనగర్ స్టేడియంలో ఈ నెల 19 వరకు కొనసాగనున్నాయి.