కేంద్ర గ్రంథాలయంలో అరుదైన గ్రంథాల ప్రదర్శన..

SMTV Desk 2017-12-15 18:48:58  rare books in the library, Chairman of the State Grants Commission, Ayyachikham Sridhar, TELUGU MAHASABHALU.

హైదరాబాద్, డిసెంబర్ 15 : రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో అరుదైన గ్రంథాల ప్రదర్శన ఉంటుందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "నగరంలోని కేంద్ర గ్రంథాలయంలో ఈనెల 16, 17, 18 వ తేదీల్లో గ్రంథాల ప్రదర్శన ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనలో వివిధ భాషలకు సంబంధించిన గ్రంథాలు ఉంటాయి. అంతేకాదు ఈ పుస్తకాలపై 30 శాతం రాయితీ కూడా ఉంటుంది" అని వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.