మరోసారి మానవతా దృక్పథాన్ని ప్రదర్శించిన సుష్మా జీ

SMTV Desk 2017-12-15 16:35:20  Union Foreign Minister Sushma Swaraj, to buy a ticket, for pakisthaani girl, twitter.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15 : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌.. ఆపదలో ఉన్నామంటే శత్రుదేశామైనా వెంటనే స్పందించి వారిని ఆదుకోవడంలో ముందుంటారు. ఎలాంటి వీసా సమస్యలనైనా వెంటనే పరిష్కరించడంలో ఆమెకు ఆమె సాటి. ఇటీవల పాకిస్తాన్ లో ఉన్న ఓ భారతీయురాలు స్వదేశానికి వచ్చేందుకు ఆర్ధికంగా సహాయం చేయడంతో పాటు స్వయంగా ఆమెకు టికెట్‌ ఏర్పాటు చేశారు. అసలు విషయం ఏంటంటే.. మొహమ్మది బేగం అనే హైదరాబాది అమ్మాయి పాకిస్తాన్ లో నివసిస్తోంది. కొన్ని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాక్‌కు చెందిన యూనిస్‌ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ.. తల్లిదండ్రులతో మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను సుష్మా స్వరాజ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమెను ఇండియాకు తీసుకురావడానికి వీసాను మంజూరు చేశారు. కాని ఆమెకు టిక్కెట్ కు కూడా డబ్బులు లేవంటూ మరో మారు సుష్మాను కోరగా స్వయంగా మంత్రి టికెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయాలను సుష్మా ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.