ఆఫ్రిది హ్యాట్రిక్ కు సెహ్వాగ్ అవుట్...

SMTV Desk 2017-12-15 15:37:08  Afridi, Virender Sehwag, t10 torni,

షార్జా, డిసెంబర్ 15: షార్జా వేదికగా గురువారం జరిగిన టీ10 టోర్నీలో ఫక్తూన్స్ జట్టు, అరేబియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగి౦ది. తొలి రోజు బ్యాటింగ్ చేసిన ఫక్తూన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెహ్వాగ్ జట్టు తొలి 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ మరుసటి ఓవర్ వేసిన ఫక్తూన్స్ సారధి షాహిద్ ఆఫ్రిది తొలి బంతికి దక్షిణాఫ్రికా ఆటగాడు రిలే రోసౌను, రెండో బంతికి వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోను, మూడో బంతికి టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో అరేబియన్ టీమ్ మొత్తం ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఫ్రిది జట్టు 25 పరుగుల తేడాతో వీరేంద్ర సెహ్వాగ్ జట్టుపై గెలిచింది.