తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై అనర్హత వేటు

SMTV Desk 2017-06-16 18:53:00  Hyderabad,AndhraPradesh, TDP,MLC Deepak Reddy,CM Chandrababu

హైదరాబాద్, జూన్ 16 : హైదరాబాద్ లో భూఆక్రమణలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అర్హతను రద్దు చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. గురువారం ఆయన నివాసంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో దీపక్ రెడ్డి వ్యవహారం పై చాలా సేపు చర్చించారు. హైదరాబాద్ లో భూముల పత్రాలపై ఫోర్జరీ సంతకాలను చేసి, భూములను తీసుకున్నారని పోలీసులు అరెస్ట్ చేయడంతో, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని పార్టీలో పెట్టుకునే అవకాశం లేదని మంత్రులతో చెప్పినట్టు సమాచారం.