ఎన్టీఆర్ ఫోటో పెట్టలేదని.. గుండుతో నిరసన...!

SMTV Desk 2017-12-15 12:12:24  ntr fan, telugu mahasabhalu, ntr photo.

జగయ్యపేట, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభల్లో, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో పెట్టలేదని ఎన్టీఆర్ అభిమాని గుండుతో నిరసన తెలిపారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు జాతీయ రహదారిపై ఎన్టీఆర్‌ అభిమాని దుర్గంపూడి రాంబాబు గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచానికి తెలుగువారి కీర్తిని చాటిచెప్పిన ఎన్టీఆర్‌ను తెలుగు మహాసభల్లో విస్మరించడం సబబు కాదని ఆలిండియా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు విమర్శించారు. రాంబాబు నిరసనకు సాంబశివరావుతో పాటు పలువు టిడిపి నేతలు మద్దతు పలికారు.