భారత క్రికెటర్ల వేతనాలు రెట్టింపు...!

SMTV Desk 2017-12-15 11:34:58  indian cricketers salaries, bcci, virat kohli,

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: త్వరలో భారత అంతర్జాతీయ దేశవాళి క్రికెటర్ల వేతనాలు పెరగనున్నాయి. జీతాలు పెంచాలని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, సారథి విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్‌ పాలకులను కలిసి రెండు వారాల క్రితం నివేదిక ఇచ్చారు. సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ, ప్రస్తుతమున్న వేతన విధానానికి అదనంగా మరో రూ.200 కోట్లను చేర్చేలా బీసీసీఐకు ప్రతిపాదించనుందని సమాచారం. దీనికి బీసీసీఐ ఆమోదం తెలిపితే సారథి విరాట్‌ కోహ్లీ జీతం రూ.10 కోట్లకు, రంజీ ఆటగాళ్ల జీతం 30 లక్షలకు పెరుగుతుంది. ప్రస్తుతం బీసీసీఐ రాబడిలో 26 శాతం వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లకు 13 శాతం, దేశవాళీ క్రికెటర్లకు 10.6 శాతం, మహిళలు, జూనియర్లకు 2.4 శాతం ఇస్తున్నారు.