మహాసభలకు చంద్రబాబును ఎందుకు పిలవలేదు..?

SMTV Desk 2017-12-15 10:58:18  kcr, chandrababu naidu, telugu mahasabhalu, LB Nagar.

హైదరాబాద్, డిసెంబర్ 15 : నేటి నుండి ప్రపంచ తెలుగు మహా సభలు జరగనున్న నేపథ్యంలో ఎంతో మంది తెలుగు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. కాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానాలు అందకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఈ వేడుకలకు ప్రముఖులందరిని పిలిచి వారిని సగౌరవంగా సత్కరించాలనుకున్న కేసీఆర్.. కావాలని చంద్రబాబును మర్చిపోయారా.? అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. మరి ఆయనను ఆహ్వానించకపోవడం విషయంపై తెలంగాణ ప్రభుత్వమే ఒక స్పష్టతను ఇవ్వాలి. కాగా ఈ వేడుకలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.