నేటి నుండి ప్రపంచ తెలుగు మహాసభలు

SMTV Desk 2017-12-15 10:27:37  Telugu mahasabhalu, start today, kcr, telangana government.

హైదరాబాద్, డిసెంబర్ 15 : ప్రపంచ తెలుగు మహాసభలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ వేదికగా జరగనున్న ఈ వేడుకలు ఈనెల 19 వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందు నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభలకు దాదాపు 42 దేశాల నుండి 450 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. విశిష్ట అతిథులుగా గవర్నర్ నరసింహన్, విద్యాసాగర రావు హాజరు కానున్నారు. ఈ రోజు కేవలం ప్రారంభ వేడుక కార్యక్రమాలను మాత్రమే చేసి రేపటి నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులను జరపనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు మహా సభలకు హాజరయ్యే వారికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులతో పాటు వసతిని ఏర్పాటు చేసింది.