ప్రతి పైసా ఆన్‌లైన్ లో ఉంచుతా : చంద్రబాబు

SMTV Desk 2017-12-14 18:32:18  POLAVARAM PROJECT, CM CHANDRABABU NAIDU, CENTRAL MINISTAR GADKARI.

విజయవాడ, డిసెంబర్ 14 : పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు మహిళలు హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు విషయ౦పై కేంద్రమంతి గడ్కరీతో చర్చించానని, 2018లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొందరు నేతలు పోలవరం ప్రాజెక్టుపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ.. శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నారని అన్నారు. దీని కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసాతో సహా ఏ కంపెనీకి వెళుతుందో కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.