సోషల్ మీడియాలో ధోని పై విమర్శలు

SMTV Desk 2017-12-14 17:18:28  ms dhoni, tweet viral, inkhabar, media, twitter

న్యూఢిల్లీ, డిసెంబర్ 14 : టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో తన అభిమానులను అలరిస్తుంటాడు. మైదానంలో ప్రశాంతగా ఉండే ‘మిస్టర్ కూల్’ తాజాగా ఓ ట్విట్ కు లైక్ కొట్టి నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇన్‌కబార్‌ అనే వార్త సంస్థ వెబ్‌సైట్‌లో “వచ్చే వన్డే వరల్ఢ్‌ కప్‌ టీమిండియాదే, మ్యాచ్‌ ఫిక్స్‌డ్‌” అంటూ ట్విట్ చేసింది. దీనికి ఎంఎస్‌ ధోని లైక్‌ కొట్టాడు. ఈ విషయంపై కొంత మంది అభిమానులు ఆగ్రహంతో అసలు ఆ ట్విట్ కు ఎందుకు లైక్ కొట్టాలి అని ప్రశ్నించగా, మరికొందరు ధోని ట్వీట్‌ను లైక్‌ చేయడంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ధోని మ్యాచ్‌ ఫిక్స్‌డ్‌ అనే పదాన్ని మరిచిపోయాడు అంటూ మరొక అభిమాని ట్వీట్‌ చేశాడు. కాగా 2009 లో ట్విట్టర్‌ సభ్యత్వం తీసుకున్న ధోని 2013లో ఒక ట్వీట్‌, 2014లో మరొక ట్వీట్‌కు లైక్‌ కొట్టాడు. మళ్లీ మూడేళ్ల తరువాత ట్వీట్‌ లైక్‌ కొట్టి విమర్శలకు గురికావడం గమనార్హం.