నారాయణ విద్యాసంస్థకు భారీ ఎత్తున జరిమానా

SMTV Desk 2017-12-13 19:28:10  International Tech Meeting,AP Human Resources Minister ganta Srinivasa Rao, Amaravathi

అమరావతి, డిసెంబర్ 13 : ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్‌ టెక్‌ సమావేశం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ మానవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, తిరుపతిలోని నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఆ కళాశాలకు రూ.50లక్షలు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. విధించిన జరిమానా చెల్లించకపోతే ఎట్టకేలకు కాలేజీల అనుమతులు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. ఈ మేరకు డీఎస్సీని ఏపీపీఎస్‌సీకి అప్పగించాలని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.