ఒడ్డుకు చేరిన జింక పిల్ల క్షణంలో పరుగు

SMTV Desk 2017-12-13 18:58:54  america, Deer, Pond

అమెరికా, డిసెంబర్ 13 : అమెరికాలోని ఒరెగాన్‌లో ఓ జింకపిల్ల అనుకోకుండా ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయింది. ఎలా వెళ్లిందో తెలీదుకానీ గడ్డకట్టుకుపోయిన చెరువు మధ్యలో చిక్కుకుపోయింది. అడుగుతీసి అడుగు వేద్దామంటే పట్టుచిక్కక కంగారు పడిపోయింది. ఎలా బయటపడాలో తెలీక ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ఈ పరిస్థితి అంతా గమనించిన కొందరు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి ఆ జింకపిల్లను ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేరిన మరుక్షణమే ఆ జింకపిల్ల పరుగు పెట్టింది.