ఏడాదిలో ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం :నారాయణ

SMTV Desk 2017-12-13 18:30:12   Narayana, amaravathi

అమరావతి, డిసెంబర్ 13 : నేడు ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పాలనకు సంబంధించిన నిర్మాణాలకు నార్మన్ పోస్టర్స్ బృందం ఇచ్చిన అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు కొత్త డిజనైన్లలను సీఎం చంద్రబాబుతో పాటు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... వారం రోజుల్లో అమరావతి పాలన నగర భవనాల నిర్మాణాలకు టెండర్లు పిలుస్తామని ఆయన ప్రకటించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాదిలో ఈ భవనాలు పూర్తిచేస్తామని అన్నారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతుందని, భవిష్యత్‌ తరాలు గుర్తించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విపక్షాల ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి అన్నారు. అసెంబ్లీకి టవర్, స్థూపాకార డిజైన్లను ఆన్‌లైన్‌లో ఉంచుతామని, ఈ మేరకు రేపు సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశం అవుతున్నట్లు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో 2019 మార్చి నాటికి రాజధాని భవనాల నిర్మాణం పూర్తి అవుతాయని మంత్రి నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.