సాహస వీరుడు వూ యంగింగ్‌ మృతి

SMTV Desk 2017-12-13 12:54:18  Woo Yanging, china, Adventure hero death

బీజింగ్‌, డిసెంబరు 13 : సాహాసోపెతుడైన ‘వూ యంగింగ్‌’ ఇటీవల మృతి చెందారు. చైనా సూపర్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ఎంతో ఎతైన అంతస్థు భవనం పైనుంచి జారి పడి మరణించారు. సాహసాలు చేయడంలో ఇతనికి ఎవరు సాటి రారు, కానీ ఇప్పుడు ఆ సాహసమే అతని ప్రాణాలు తీసింది. యంగింగ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన దాని ప్రకారం... "స్టంట్స్‌ చేస్తున్నప్పుడు ప్రమాదాలు ఎదురైనా కొద్దిలో బయటపడేవాడు. కానీ నవంబరు 8న మాత్రం అతను మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయాడు. హునన్‌ రాష్ట్ర రాజధాని ఛాంగ్సాలోని 62 అంతస్థుల భవనం రూఫ్‌టాప్‌ పట్టుకుని ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే బస్కీలు(పుషప్స్‌) తీయడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా పట్టు తప్పి 62 అంతస్థుల పైనుంచి కింద పడి, చనిపోయాడు." అందులో ఆమె పోస్ట్‌ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు ఈ సాహసం చేస్తే వచ్చే 15వేల డాలర్లు.. తన పెళ్లి ఖర్చులకు, తల్లి వైద్యానికి ఉపయోగపడతాయని వూ భావించినట్లు అక్కడి సామాజిక మాధ్యమం వెల్లడించింది.