ఏడాదిలో రెండు సార్లు వైద్య శిబిరం

SMTV Desk 2017-12-12 18:25:20  Ramoji Film City, Medical camp, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 12 : ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా రామోజీ గ్రూపు మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈఎస్‌ఐ సహకారంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, మందుల పంపీణీకి శ్రీకారం చుట్టారు. ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహన్‌రావు ఈఎస్‌ఐ సంయుక్త సంచరకురాలు పద్మ, మానవనరుల ప్రెసిడెంట్ గోపాల్ రావు, డైరెక్టర్ సోహన, సీఈవో రాజీవ్‌ జల్నాపూర్కర్‌ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఫిల్మ్‌సిటీలో పని చేసే సుమారు 6 వెళ్ళ మంది ఉద్యోగులు ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ కార్యకలాపాలు కూడా సకాలంలో పూర్తి అవుతాయన్న ఉద్ధేశంతో ఏడాదికి రెండు సార్లు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రామోజీ గ్రూపు మానవనరుల విభాగ ప్రెసిడెంటు గోపాలరావు అన్నారు. పని చేస్తున్న చోటే వైద్య సేవలు అందిస్తే, వారి పని ఒత్తిడికి అనుగుణంగా చికిత్స చేసే అవకాశం ఉంటుందని ఈఎస్‌ఐ సంయుక్త సంచారకురాలు పద్మ తెలిపారు.