యువరాజ్ కోసం హర్భజన్ వీడియో

SMTV Desk 2017-06-16 16:25:23  harbhajan sing, yuvaraj sing

న్యూఢిల్లీ , జూన్ 16 : టీమిండియా లో చాలా మంది స్టార్ బ్యాట్స్ మెన్స్ ఉన్నారు. అందరు ఎవరికీ వాళ్ళు గొప్ప ఆటను ప్రదర్శించిన వల్లే ఇందులో యువరాజ్ సింగ్ ఒకరు. యువరాజ్ సింగ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫి లో అద్భుతంగా ఆడుతున్నాడు. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ యువరాజ్ సింగ్ కు 300వ వన్డే కావడం విశేషం. భారత్ బ్యాట్స్ మెన్ యువరాజ్ తో స్పిన్నర్ హర్బజన్ సింగ్ కు ఉన్న అనుభందం చాలా గొప్పది. ఈ సందర్బంగా యువరాజ్ గురించి భజ్జీ సోషల్ మీడియాలో ఓ వీడియో ను పోస్ట్ చేశాడు. 'ఏళ్ల పాటు ఇద్దరూ కలసి డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకున్నాం, ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్ లు ఆడాం. యువరాజ్ 300వ వన్డే ఆడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అరుదైన ఘనతను సాధించిన యువీకి నా శుభాకాంక్షలు. దేవుడి దయ వల్లే నేను 100 టెస్టులు ఆడగలిగా, యువరాజ్ నువ్వు రికార్డు స్థాయిలో 300వ వన్డే ఆడుతున్నావు. ఇండియన్ క్రికెట్లో నీ ప్రయాణం నిజంగానే గొప్ప విషయం. నువ్వు మైదానంలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఛాంపియన్ వే గాడ్ బ్లెస్ యూ బ్రదర్' అని చెబుతూ వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.